లఘు చిత్రం నిర్మించుట కోసం నిధుల కొరకు అభ్యర్దన:

కంభోడియా దేశంలో కరోనా వైరస్ యొక్క ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ప్రజలకు అవగాహన కల్పించాలనే మంచి సంకల్పంతో ఒక లఘు చిత్రం నిర్మించాలని తలచాము, ఇది కొంత ఖర్చుతో కూడుకున్న పని కావున, ఈ బృహత్తర కార్యక్రమం కోసం నిధులను సేకరించి, అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాము. ఇందులో మీరు కూడా పాత్రులై మీకు తోచిన మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాము

Angkor Wat aerial view, Siem Reap, Cambodia

ఈ కరోనా సమయంలో, తక్కువ ఆదాయం వున్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి మరియు కొద్దిగా ఆదాయం ఉన్న పరిస్థితిలో ,కొంచెం గిట్టు బాటు ధర దొరికినప్పుడు , అది పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తూ ఆనందానికి గురిచేస్తుంది .కావున కంబోడియాలో పర్యటించేటప్పుడు ఇక్కడ ఉన్న ,చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారుల దగ్గర బేరాలు చెయ్యొద్దు అని చెప్పడమే ఈ లఘు చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం

పారదర్శకత కొరకు నిధుల గురించి వివరణ:

ఈ లఘు చిత్రం 7 – 9 రోజుల వరకు షూట్‌ జరుగుతుంది మరియు వాటి పూర్తి వివరాలు :

  1. ఈ చిత్రం షూట్ చేయడానికి వీడియో కెమెరా సిబ్బంది (3 వ్యక్తులు). (US $ 500).
  2. కెమెరా పరికరాలు, లైటింగ్ మరియు ఉపకరణాల కోసం అద్దె. (US $ 500).
  3. షార్ట్ ఫిల్మ్ కోసం అదనపు సహాయక సిబ్బంది (3 వ్యక్తులు). (US $ 300).
  4. వీడియో షూట్ కోసం పరికరాలు మరియు సిబ్బందిని వివిధ సైట్లకు రవాణా చేయడం. (US $ 300).
  5. తారాగణం మరియు సిబ్బందికి వసతి, 12 మంది. (US $ 400).
  6. పూర్తి తారాగణం మరియు సిబ్బందికి ప్రాథమిక ఆహారం మరియు పానీయాల అవసరాలు. (US $ 300).
  7. లఘు చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్. (US $ 600).
  8. DI (డిజిటల్ ఇంటర్మీడియట్) మరియు కలర్ గ్రేడింగ్. (US $ 600).
  9. సంగీత కూర్పు మరియు సంబంధిత ఆడియో వాయిస్ ఓవర్లు. (US $ 500).

మొత్తం అవసరమైన నిధుల ఖర్చు US $ 4,000 మరియు ఈ లఘు చిత్రం చివరిలో సహకారుల పేర్లు క్రెడిట్స్ రూపంలో ఇవ్వబడతాయి

 

సాధించాలన్న లక్ష్యం :

ఈ లఘు చిత్రం యొక్క లక్ష్యం పెద్ద చిత్రానికి పైలట్ ప్రాజెక్ట్ గా తాయారుచేయడం, తద్వారా పెద్ద చిత్రం చేయగలమన్న నమ్మకానికి ఈ లఘు చిత్రం మాకు తొలి మెట్టు .
గత ప్రాజెక్టులు, నేను నా సొంత ఖర్చులతో చేశాను , కాని ఈ చిత్రంతో లక్ష్యం మునుపటి కంటే చాలా పెద్దదిగా, పెద్ద చిత్రానికి ధీటుగా తీయాలన్నదే మా లక్ష్యం కానీ అది కొంత ఖర్చుతో కూడుకున్న పని ,తీసుకురాగలిగిన మార్పును పరిశీలిస్తే, ఈ చిత్రం ఎలాంటి సామర్థ్యాన్ని కలిగిస్తుందో చూడడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది!

అదే విధంగా మీ సహాయన్ని, ప్రోత్సాహాన్ని సోషల్ మాధ్యమాల్లో తెలుపుతూ మరింత ప్రచారానికి తోడ్పడండి.